కరోనాతో దేశ ఆర్థికస్థితి దిగజారినా..సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ ఫ్లూయెన్సర్ల ఆదాయం భారీగా పెరిగింది. ఇంట్లోనే కూర్చుని వీడియోలు చేస్తూ అనేక మంది భారీగా సంపాదిస్తున్నారు. రెండేళ్లలో క్రియేటర్ ఎకానమీ రూ.1300కోట్లకు చేరింది. ప్రపంచస్థాయి సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ప్రచారానికి సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవడం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. 2016లో 1.7బిలియన్ డాలర్లుగా ఉన్న క్రియేటర్ ఎకానమీ 2019కి 6.5బిలియన్లకు 2020లో 9.7బిలియన్ డాలర్లకు చేరింది.