నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారం పెను సవాలుగా పరిణమిస్తోందని సీఈసీ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దేశంలో 95 కోట్లు ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. 11లక్షల పోలింగ్ బూత్లున్నాయని, దాదాపు కోటి మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. జర్మనీ విదేశాంగ బృందం భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో రాజీవ్ కుమార్ వారితో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్లో ఎన్నికల నిర్వహణ తీరును జర్మనీ ప్రశంసించింది. భిన్న సవాళ్లు ఉన్నప్పటికీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించడం ప్రశంసనీయమని తెలిపిది.
సోషల్ మీడియాతోనే సవాలు: సీఈసీ

© ANI Photo