సోషల్ మీడియా ఊహకు అందనిది. తలచుకుంటే ఒక వ్యక్తిని అందలం ఎక్కించగలదు. పాతాళానికి తొక్కేయగలదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. సోషల్ మీడియా యూజర్లు ఇది వరకు కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో పై విపరీతంగా ప్రేమను కురిపించారు. ఇప్పుడు వారి కన్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పై పడింది. రష్యాపై యుద్దంలో అతను చూపిస్తున్న ధైర్య సాహసాలు చూసిన నెటిజన్లు జెలెన్స్కీ ని ప్రపంచంలోని అత్యంత శృంగార పురుషుడు గా మార్చాయి. రెబెక్కా అనే ట్విటర్ యూజర్ నేను నా భర్తకు జెలెన్స్కీపై ప్రేమ ఉందని చెప్తే.. అతను నాకు కూడా అని బదులిచ్చాడు అని కామెంట్ చేసింది. మరో యూజర్ నేను స్వలింగ సంపర్కుడిని కాదు, కానీ జెలిన్స్కీ నాకు మ్యాన్ క్రష్ అని కామెంట్ చేశాడు. కాగా, జెలెన్స్కీ సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు.