ఆర్మీ జవాన్ల మానవత్వానికి ఈ ఘటన నిదర్శనం. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని 14కిలోమీటర్ల పాటు భుజాలపై మోసుకెళ్లారు. తీవ్ర హిమపాతం ఉండటంతో రోడ్డు ప్రయాణాలు చేయడం అతి కష్టంగా మారింది. దీంతో హర్గం అనే గ్రామం నుంచి సైన్యానికి ఎమర్జెన్సీ కాల్ అందింది. గర్భిణి పరిస్థితి గురించి తెలియజేయగా.. జవాన్లు 6 గంటల పాటు శ్రమించారు. మరో గ్రామంలో అంబులెన్సుని సిద్ధం చేయడంతో జవాన్లు స్ట్రెచర్‌పై గర్భిణిని తీసుకొచ్చారు. అక్కడినుంచి ఆసుపత్రికి తరలించారు. అనంతరం గర్భిణి కుటుంబ సభ్యులు జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు.