తెలంగాణ మజీ సీఎస్ సోమేష్ కుమార్ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ క్యాడర్‌కు కేంద్రం బదిలీ చేయడంతో ఈమేరకు ఆయనతో చర్చించారు. డిసెంబర్లో తాను రిటైర్ కానున్న విషయాన్ని సీఎంకు తెలియజేశారు. ఇటీవల హైకోర్టు తీర్పు దృష్ట్యా ఈరోజు ఏపీ సీఎస్‌కు సోమేష్ కుమార్ రిపోర్ట్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ఏపీకి కేటాయించబడ్డారు. కానీ ఆయన తెలంగాణలోనే ఉండిపోయారు.మరోవైపు తెలంగాణ కొత్త సీఎస్‌గా ఐఏఎస్ అధికారి శాంతకుమారి బాధ్యతలు చెపట్టారు.