అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాలో సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా చేస్తున్నారనే వార్తలపై ఆమె స్పందించింది. తాను తెలుగు సినిమాలో నటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడించింది. చిత్రం కోసం సంప్రదించి పారితోషికం ఎక్కువ అడగటంతో తీసేశారనేది నిజం కాదని చెప్పింది. తన కెరీర్ గురించి సెటైర్ వేసుకుంటూ ఎప్పుడూ నెం.1గా లేని హీరోయిన్ ను ఎవరైనా తీసుకుంటారా అని పోస్ట్ చేసింది. ఈ బాలీవుడ్ బ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.