సోనాలి బింద్రే తెలుగులో చివరగా చిరంజీవితో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత హిందీకే పరిమితం అయిపోయింది. అయితే 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో రీఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్‌టీఆర్ నటిస్తున్న చిత్రంలో సొనాలి ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలీదు కానీ, ఆమెను మళ్లీ తెలుగు తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.