కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశానికి జీ23 గ్రూప్ తరపున గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీ గంటపాటు జరిగింది. అంతకుముందు జీ23 నేతలు చేసిన ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. సోనియాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆజాద్ పలు కీలక అంశాలు వెల్లడించారు. రాబోయే ఎన్నికలకు పార్టీ బలోపేతంపైనే చర్చించామని చెప్పారు. నాయకత్వం గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగుతారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలను ఎదుర్కోవడం, పార్టీ బలోపేతం గురించిన అంశాలే చర్చకు వచ్చాయని తెలిపారు.