కరోనా సమయంలో ఎంతో మందిని ఆడుకొని ఆపద్భాందువుడిగా నిలిచాడు సోనూసూద్. వందల మందికి సహాయం అందించి తన దాతృత్వాన్ని చూటుకున్నాడు. తాజాగా మరోసారి మంచి తనాన్ని చాటుకున్నాడు. బీహార్‌కు చెందిన చాముఖి అనే అమ్మాయికి శస్త్ర చికిత్స చేయించాడు. ఈ అమ్మాయికి 8 అవయవాలు ఉండడంతో ఆమెకు ఆపరేషన్ చేయించి మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. ఈ మేరకు చాముఖి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సోనూసూద్‌కు నెట్టింట ప్రశంశలు వెలువెత్తుతున్నాయి.