హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించారు. విషయం తెలిసిన తర్వాత తాను షాక్ అయ్యానని, చాలా దురదృష్టకరమని అన్నారు. రేపిస్టులకు కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యాచార కేసుల్లో శిక్షలు కఠినంగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు ఎవరూ చేయకూడదని సోనుసూద్ తెలిపారు. నేరానికి సంబంధించినప్పుడు మేజర్, మైనర్ అనే భేదం లేదని పేర్కొన్నారు. మరోవైపు పబ్లను తప్పుపట్టడం సరికాదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యాచార ఘటనలు జరుగు తున్నట్లు గుర్తు చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం(జూన్ 14) సందర్భంగా UBlood యాప్ను ప్రారంభించేందుకు సోనూసూద్ హైదరాబాద్ వచ్చారు.