ఇండియాలో సోనీ ప్లేస్టేషన్ 5(Sony PlayStation 5 ) ప్రీ-ఆర్డర్స్ ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. PS5 ధర డిజిటల్ ఎడిషన్‌కు రూ.39,990, బ్లూ-రే వెర్షన్‌కు రూ.49,990గా ఉంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరి 22న సేల్ తర్వాత తిరిగి మార్చి 24న ఈ సేల్ ప్రారంభమైంది. ఈ సారి కూడా సోనీ ప్లేస్టేషన్ 5 స్టాక్ పరిమితంగానే లభించనున్నట్లు తెలుస్తోంది. చిప్‌ల కొరత కారణంగా సోనీ తయారీ సమస్యను ఎదుర్కొంటుందని మీడియా రిపోర్టులు చెప్తున్నాయి.