సోనీ ప్లే స్టేషన్ 5ను నేటి నుంచి తిరిగి అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ తెలిపింది. లాస్ట్ ఇయర్ వీటిని ఇండియాలో లాంచ్ చేసిన నుంచి ఇప్పటి వరకు లిమిటెడ్ గానే అందుబాటులో ఉంటున్నాయి. ఇందులో రెండు రకాల యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. బ్లూ రే ప్లేస్టేషన్ 5, ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్లతో పాటుగా పలు రిటైల్ స్టోర్లలో కూడా ఈ ప్టే స్టేషన్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఆన్‌లైన్ కంటే రిటైల్ లోనే ఎక్కువ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయి. స్టాక్స్ లిమిటెడ్ గా ఉండనున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. సోనీ ప్లే స్టేషన్ 5 బ్లూ రే కు రూ.49,990, ప్లే స్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ కు రూ. 39,990ని కంపెనీ నిర్ణయించింది.