ఏపీలో త్వరలో మరో క్రికెట్ పండగ ప్రారంభం కాబోతోంది. జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలోని వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో టోర్నమెంట్ జరగనుంది. 17న జరిగే ఫైనల్ కు హాజరుకావాలని సీఎం జగన్ కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం ఇచ్చింది. స్థానిక ప్రీమియర్ లీగ్ లకు ఇప్పటికే బీసీసీఐ తమిళనాడు, కర్ణాటక, సౌరాష్ట్రలకు అనుమతివ్వగా నాలుగో రాష్ట్రంగా ఏపీ నిలిచింది.