త్వరలోనే ముక్కు ద్వారా తీసుకొనే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి కూడా చేసింది. భారత ప్రభుత్వం అనుమతిస్తే ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్ కృష్ణ ఎల్లా స్పందించారు. తాము నాజిల్ వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, అంతా సవ్యంగా జరిగితే ఆగష్టులో దీనికి సంబంధించిన రేగులటరీస్ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.