భారత జట్టు మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలవబోతున్నాడు. 2019 సీజన్లో దిల్లీకి మెంటార్‌గా చేసిన గంగూలీ, దిల్లీ జట్టు డైరెక్టర్‌గా చేరబోతున్నాడు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి గంగూలీ దిగిపోయాడు. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న గంగూలీ, దిల్లీ జట్టు ప్రదర్శన మరింత మెరుగుపడేందుకు సాయపడతాడని జట్టు విశ్వాసం వ్యక్తం చేసింది.