టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దాదా పొలిటికల్ ఎంట్రీ ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఆయన కేంద్ర మంత్రి అమిత్ షాతో మే నెలలో రెండు సార్లు సమావేశమయ్యారు. ఇప్పటి వరకు క్రికెట్ కు సేవ చేశా.. రాజకీయాల్లోకి వస్తే ఎక్కువ మంది ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని దాదా అన్నారు. దాదా బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.