ఎలాన్ మస్క్ వెంచర్ స్పేస్ఎక్స్ కొత్తగా మరో 48 స్టార్‌లింక్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. బుధవారం ఉదయం 8.45 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ స్టేషన్ నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు కంపెనీ తెలిపింది. ఫాల్కన్ 9 రాకెట్లో ఈ ఉపగ్రహాలను పంపినట్లు ప్రకటించారు. స్టార్‌లింక్ తక్కువ భూ కక్ష్యలో స్పేస్ఎక్స్ సమీకరించే బ్రాడ్‌బ్యాండ్ నెట్ వినియోగం కోసం పెద్ద ఉపగ్రహాల కూటమిగా ఏర్పడింది. ఈ కంపెనీ ఇప్పటికే 2019 నుంచి 2,000 కంటే ఎక్కువ స్టార్‌లింక్ క్రాఫ్ట్‌లను ప్రారంభించింది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగించడానికి దరఖాస్తు చేసుకున్నట్లు నివేదిక తెలిపింది.