అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రాకుండా తెలంగాణలోని ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెల్సిందే. ఈ రోజు చివరి రోజు సమావేశాలు కావడంతో వారిని అసెంబ్లీకి రానిస్తారని అంతా భావించారు. కానీ ఈ రోజు కూడా వారిని రానిచ్చేది లేదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు కూడా వారిని రానివ్వొద్దన్నారు.