ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు నేటి నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా ఇంటర్ విద్యాధికారి దయానందరాజు తెలిపారు. జిల్లాలో గల 27 జూనియర్ కళాశాలల్లో నిర్వహించే ఈ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. స్లిప్ టెస్టులు, వారాంతపు పరీక్షలు నిర్వహించి సబ్జెక్టుపై పట్టు సాధించేలా బోధిస్తామని ఆయన వెల్లడించారు.