కేంద్ర ప్రభుత్వానికి చెందిన నిరుపయోగ, మిగులు భూముల మానిటైజేషన్‌కి ప్రత్యేక కార్పొరేషన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భూములు పర్యవేక్షణకు జాతీయ భూ మానిటైజేషన్ కార్పొరేషన్‌ని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ప్రయోజనాలకు ఉపయోగపడని ఈ భూములను మానిటైజ్ చేయడం వల్ల భారీ ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.