దర్శకుడిగా త్రివిక్రమ్ తొలి సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ, సునీల్, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించి అలరించారు. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కింది. అయితే, ఈ సినిమా విడుదలై అక్టోబరు 10 నాటికి 20 ఏళ్లు పూర్తిచేసుకోనుంది. ఈ క్రమంలో చిత్రబృందానికి స్పెషల్ స్క్రీనింగ్ చేయనున్నారు. హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. స్రవంతి మూవీస్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ స్క్రీనింగ్ జరగనుంది.