సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 11న రాత్రి 7.50కి విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రైలు బయలు దేరుతుందని వెల్లడించింది. 11, 13, 16 తేదీల్లో విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు, 12, 14, 17 తేదీల్లో రాత్రి 7.40కి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు తెలిపింది. రేపటి నుంచి (జనవరి 10) రిజర్వేషన్లు ప్రారంభం కానున్నాయి.