సికింద్రాబాద్ నుంచి కేరళ వెళ్లి వచ్చే శబరిమల భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. రానుపోను కలిపి 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించింది. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి కొల్లం, కొట్టాయం వరకు వెళతాయని పేర్కొంది. శబరిమల వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా ఇబ్బంది కలగకుండా రైళ్ల సంఖ్యను పెంచినట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శబరిమలకు ప్రత్యేక రైళ్లు

© ANI Photo