దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తిపై దిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. ఇది కోవిడ్ వైరస్ మాదిరే వ్యాప్తి చెందుతోందని వెల్లడించారు. తుంపర్ల రూపంలో ఈ ఫ్లూ గాలిలో ప్రసారమై ఇతరులకు సోకుతోందని చెప్పారు. ‘స్వైన్‌ఫ్లూ(హెచ్1ఎన్1) వల్ల ఒక మహమ్మారిని చూశాం. ఇప్పుడు దానికి సంబంధించిన వేరియంట్ హెచ్3ఎన్2లో ఉత్పరివర్తనం చోటు చేసుకుంది. అందుకే తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉంటే మంచిది. పైగా, పండుగల సీజన్ ఉన్నందున ఈ ఫ్లూ వ్యాప్తిని నిర్లక్ష్యం చేయకూడదు’ అని గులేరియా చెప్పారు.