దేశంలో ఇన్‌ఫ్లూయెంజా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో హోలీ సంబరాలు జరుపుకొనే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు, కోమార్బిడ్ వ్యాధుల బాధితులు అప్రమత్తంగా ఉండాలి. హోలీ సమయంలో మాస్కు తప్పక ధరించాలి. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు పొడి రంగులను చల్లుకోవద్దు. నలతగా ఉంటే బయటకు రాకపోవడమే మంచిది. చేతులను ముక్కు, చర్మం, నోటికి తాకనివ్వొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ పండుగను జరుపుకోండి.