భారత్‌లోని పాపులర్ కూల్‌డ్రింక్స్‌లో ఒకటైన స్ప్రైట్ బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదిగింది. అంటే దాదాపు ఏటా రూ.8,300 కోట్లు అర్జిస్తోందన్నమాట. కోకాకోలా ఛైర్మన్ జేమ్స్ క్విన్సీ ఈ విషయాన్ని వెల్లడించారు. 2022 మూడో త్రైమాసికంలో భారత మార్కెట్లో అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఆయన అన్నారు. యాడ్స్, ప్రచార కార్యక్రమాలు తమ బ్రాండింగ్ పెంచుకోవడంలో ఉపయోగపడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. కోకా కోలాకు అంతర్జాతీయంగా భారత్ ఐదో అతిపెద్ద మార్కెట్. ఈ సంస్థకు చెందిన థమ్స్అప్ ఇప్పటికే బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఉంది.
బిలియన్ డాలర్ బ్రాండ్‌గా Sprite

© File Photo