చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన ఇన్‌స్టా ఖాతా ద్వారా చేసిన ఓ పోస్టు ఈ ఊహాగానాలను బలపరుస్తోంది. ‘నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశాన్ని ఇచ్చిన 2022 ఏడాదికి ధన్యవాదాలు. అపరమితమైన ప్రేమను కురిపించే, కష్టసుఖాల్లో నా వెన్నంటి వుండే, అన్నిటికన్నా నన్ను నన్నుగా చూసే వ్యక్తిని కలవడం ఎంతో అద్భుతం. ఇక మన ప్రయాణాన్ని మొదలుపెడదామా’ అంటూ అందులో రాసుకొచ్చింది. దీంతో మూడో పెళ్లి గురించే అయ్యుంటుందని అంతా అనుకుంటున్నారు. 2016లో కళ్యాణ్ దేవ్‌తో శ్రీజ రెండో వివాహం చేసుకుంది. కొంతకాలంగా వీరిద్దరి విడిగా ఉంటున్నట్లు సమాచారం.