IPL: ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్న ఆరెంజ్ ఆర్మీ

© File Photo

IPL 2022లో ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ అంచనాలకు మించి రాణిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా లీగ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. నిన్నటి వరకు మన నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉండటంతో విజయాలు ఉన్నా కానీ సరైన నెట్ రన్ రేట్ లేని కారణంగా పాయింట్ల పట్టికలో కింద ఉన్న ఆరెంజ్ ఆర్మీకి నిన్న ఆర్సీబీ మ్యాచ్‌తో ఆ బెంగ కూడా తీరిపోయింది. మనోళ్లు 2 మ్యాచుల్లో వరుసగా ఓడినా కానీ ఓ అరుదైన ఘనతను మాత్రం తమ పేర లిఖించుకున్నారు. ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడిన ఆరెంజ్ ఆర్మీ ఒక్కటంటే ఒక్క మ్యాచులో కూడా టాస్ ఓడిపోలేదు. టాస్ గెలవడం మొదట బౌలింగ్ తీసుకోవడం ప్రత్యర్థిని తక్కువకే కట్టడి చేయడం ఆరెంజ్ ఆర్మీకి పరిపాటిగా మారింది.

Exit mobile version