డేవిడ్ వార్నర్‌ను వదిలేసుకోవడాన్ని SRH అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్క సీజన్ ఫామ్‌లో లేడని వదిలేయడం దారుణమని చాలా మంది ఇప్పటికే SRH యాజమాన్యాన్ని విమర్శించారు. తాజాగా డీసీతో జరిగిన మ్యాచులో వార్నర్ 92* నాక్ ఆడాడు. వార్నర్ వల్ల గెలుస్తుందనుకున్న SRH చివరి మెట్టుపై బోల్తాపడింది. అసలు వార్నర్ ను వదిలేసుకోవడం సరైన నిర్ణయం కాదని SRH యాజమాన్యాన్ని ఎప్పటినుంచో విమర్శిస్తూ వస్తున్న ఫ్యాన్స్ కోపానికి నిన్న వార్నర్ నాక్ మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో SRH ఓనర్ కావ్య మారన్ పై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. టీ20 బ్యాటర్ అయిన వార్నర్ ను వదిలేసుకుని రూ.16 కోట్లు పెట్టి టెస్టు బ్యాటర్‌ను రిటేయిన్ చేసుకుంటావా అని ప్రశ్నిస్తున్నారు.