2021 ఐపీఎల్ సీజన్‌ను పీడకలలా మర్చిపోయిన SRH అభిమానులకు 2022 ఐపీఎల్ సీజన్ కూడా పెద్దగా కలిసి రాలేదు. మెగా వేలంలో టీం మొత్తాన్ని మార్చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో 61 పరుగులతో ఓడిపోయి లీగ్‌ను ఓటమితో ప్రారంభించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ జట్టు మొదట బాగానే బౌలింగ్ చేసింది. మొదటి ఓవర్లోనే రాజస్థాన్ విధ్వంసకర బ్యాటర్ జాస్ బట్లర్ అవుటయ్యాడు. కానీ ఆ బంతిని సీనియర్ పేసర్ భువీ నోబాల్ వేయడంతో బట్లర్ బతికిపోయాడు. ఇక లైఫ్ అందుకున్న బట్లర్ చెలరేగిపోయాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపించడంతో హైదరాబాద్ బౌలర్లు చూస్తూ ఉండిపోయారు. అంతే కాకుండా స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ కేన్ మామకు జరిమానా కూడా పడింది.