టాటా ఐపీఎల్ 2022లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRHలో మార్కరం(42), నికోలస్ పూరన్(62) రాణించారు. మిగతా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించకపోవడంతో హైదరాబాద్ నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో SRH 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. అటు DC బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3, శార్దూల్ ఠాకూర్ 2, అన్రిచ్ నోర్ట్‌జే, కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్చ్ తలో వికెట్ తీసుకున్నారు.