‘అందుకోసమే రషీద్ ఖాన్‌ను వదిలేసాం’

Courtesy Instagram:IPL

IPLలో SRH ప్రాంచైజీకి ఒంటి చేత్తో ఎన్నో విజయాలు అందించాడు మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్. కానీ ఈ సారి మాత్రం అతడు తన పాత ప్రాంచైజీ SRHను వీడి గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అసలు ఆరెంజ్ ఆర్మీ రషీద్ ఖాన్‌ను ఎందుకు వదిలేసుకుందా? అని చాలా మంది SRH అభిమానులకు అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఈ విషయం మీద అటు రషీద్ ఖాన్ గానీ ఇటు SRH యాజమాన్యం కానీ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. కానీ నిన్న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్బంగా SRH స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ రషీద్ ఖాన్‌ను SRH ప్రాంచైజీ ఎందుకు వదిలేసిందా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. రషీద్ ఖాన్‌ను మేము అఫర్డ్ (భరించడం) చేయలేమని అందుకోసమే వదిలేసినట్లు తెలిపాడు.

Exit mobile version