IPL 2022లో ఆదివారం మధ్యాహ్నం SRHతో జరిగిన 54వ మ్యాచులో RCB అదరగొట్టింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు 3 వికెట్లు నష్టానికి 192 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కు 193 పరుగుల టార్గెట్ ఇచ్చింది. డుప్లెసిస్ (73), పాటిదార్ (48), మాక్స్ వెల్ (33) రన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇక సుచిత్ ఇద్దరిని ఔట్ చేశాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన SRH మూడు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది.