ఇండియా vs శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 109 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. మొదటి రోజు నుంచే ధాటిగా బౌలింగ్ చేస్తున్న ఇండియన్ బౌలర్లు లంక బ్యాటర్లను ఉక్కిబిక్కిరి చేశారు. లంక బ్యాటర్లలో మాథ్యుస్ 43), డిక్వెళ్ల(21) మినహా మిగతావాళ్లంతా చేతులెత్తేశారు. దీంతో శ్రీలంక 109 పరుగులే చేయగలిగింది. అటు ఇండియా బౌలర్లలో బుమ్రా 5, షమీ 2, అశ్విన్ 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీసుకున్నారు.