శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం దారుణ స్థితికి చేరుకుంటోంది. పెట్రోల్, డీజిల్ కోసం రోజుల తరబడి క్యూలో నిలబడి జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గురువారం మరొకరు ఇలా చనిపోయారు. 63 ఏళ్ల ట్రక్ డ్రైవర్ 5 రోజులపాటు లైన్‌లో ఉండి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు బంకుల వద్ద లైన్లో నిలబడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 10కి చేరినట్లు అధికారులు చెబుతున్నారు. వీరంతా 43 నుంచి 84 ఏళ్ల మధ్య వయసున్న వారేనని వివరించారు.