నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగుకి దిగిన భారత్ భారీ స్కోరు చేసింది. శ్రీలంకకు 229 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. సూర్యకుమార్ యాదవ్ అజేయ సెంచరీతో చెలరేగి ఆడాడు. 51బంతుల్లోనే 112 పరుగులు చేశాడు. మరోవైపు, గిల్(45), త్రిపాఠి(35), అక్షర్(21*) రాణించడంతో 5 వికెట్లు కోల్పోయి టీమిండియా 228 పరుగులు చేయగలిగింది. ఇషాన్ కిషన్(1), పాండ్యా(4) మరోసారి నిరాశ పరిచారు. అయితే, చివరి 5 ఓవర్లలో టీమిండియా 64 పరుగులు సాధించడం గమనార్హం. శ్రీలంక బౌలర్లలో హసరంగ(1/36), రజిత(1/35) కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు.