ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిన అక్కడి ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా సైన్యాన్ని కూడా తగ్గించాలని చూస్తోంది. 2030 నాటికి ప్రస్తుతమున్న సైన్యాన్ని సగానికి తగ్గించుకోనున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో వ్యూహాత్మక , సాంకేతికతను బలపరిచేందుకు చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం 2,00,0783 సైనిక సామర్థ్యం కాగా.. లక్షకు పరిమితం చేయనున్నారు. వచ్చే ఏడాది నాటికే 1.35 లక్షలకు తగ్గిస్తారు.