హమ్మయ్యా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు లంకేయులు నవ్వారు

Courtesy Instagram:Sri Lanka Cricket

వరుస కష్టాలతో అతలాకుతలమవుతున్న లంకేయులు చాన్నాళ్ల తర్వాత మనసు నిండా నవ్వారు. ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు దశాబ్దాల తర్వాత లంకేయులు కంగారూలను ఖంగు తినిపించి.. వారిపై 5 వన్డేల సిరీస్ ను గెలిచి సత్తాచాటారు. 4వ వన్డేలో లంకేయులు నాలుగు పరుగుల తేడాతో కంగారూలను మట్టి కరిపించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. సిరీస్ గెల్చకున్నారు. గెలుపు కోసం చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా… ఆస్ట్రేలియా కేవలం 15 పరుగులు మాత్రమే చేయడంతో లంక ఆఖరు బంతికి విజయకేతనం ఎగురేసింది.

Exit mobile version