శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కీలక ప్రకటన చేశారు. తన పదవీ కాలం మిగిలిన రెండేళ్లు పూర్తైన తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగిన నేపథ్యంలో అతన్ని పదవి నుంచి బహిష్కరించాలని గతంలో పలువురు ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలంబోలో సోమవారం జరిగిన ఇంటర్వ్యూలో భాగంగా రాజపక్సే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు గోటబయ రాజపక్సే, కొత్త ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే IMF, ఇండియా, చైనాతో సహా దేశాల నుంచి సాయం కోరారు.