శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) తెలుగు జాతి గర్వించదగ్గ కవులలో ఒకరు. ఆయన కుమార్తె నిడుమోలు మాలా తాజాగా మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. శ్రీశ్రీ, సరోజ దంపతులకు మాలా నాలుగవ సంతానం. చెన్నైలోనే పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఆమె, మద్రాస్ లా కాలేజీ ద్వారా న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. ఆ తర్వాత 1989లో మద్రాస్-పుదుచ్చేరి బార్ అసోసియేషన్ లో మెంబర్ అయ్యారు. 2020లో పాండిచ్చేరి గవర్నమెంట్ లాయర్ గా నియమితులైన తొలి మహిళగా మాలా గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టు కొలీజియం న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సిఫారసు చేయగా.. అందులో ఈమె పేరుకు కూడా రాష్ట్రపతికి ఆమోద ముద్ర వేశారు.