మన పొరుగుదేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో అక్కడి తమిళులు సముద్రమార్గం ద్వారా భారత్ లోకి అక్రమంగా తరలివస్తున్నారు. అక్కడి నుంచి రామేశ్వరం, ధనుష్కోటికి వలసలు కట్టారు. ఈ నేపథ్యంలో అక్కడి మన్ కోస్ట్ గార్డ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా, శ్రీలంకలో ధరలు విపరీతంగా పెరగడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.283, డీజిల్ రూ.220, కిలో చికెన్ రూ.1000, ఒక కోడిగుడ్డు ధర రూ.35కి చేరిందంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.