‘ధమాకా’ బ్లాక్‌బ్లాస్టర్‌తో కుర్ర హీరోయిన్ శ్రీలీలపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. ‘ధమాకా’ సక్సెస్‌తో ఈ భామకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. స్టార్ హీరోలు, డైరెక్టర్స్ చూపు ఈ అమ్మడిపై పడింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ధమాకా మూవీకి రూ.30 లక్షలు తీసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం రూ.కోటి డిమాండ్ చేస్తోందని టాక్. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాడీలక్స్’ సినిమాలో ఓ హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.