ఏపీలోని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ మారబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శిల్పా తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం. కాగా ఈ వార్తలపై ఎమ్మెల్యే శిల్పా స్పందించారు. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. అబద్దాలను ప్రచారం చేయడంలో చంద్రబాబు, లోకేశ్‌లను మించినవారు లేరని ఆయన మండిపడ్డారు.