శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 43,732 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 33,936 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఏపీ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 9,591 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వెళ్తోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం వరద నీరు 881 అడుగులకు చేరుకుంది.