TS: ములుగులోని ఓ ఏఆర్ ఎస్సై పన్నిన కుట్రని తెలంగాణ నిఘా విభాగం భగ్నం చేసింది. తాడ్వాయి పరిధిలో ఓ సాయుధ దళాన్ని తయారు చేసి.. అనంతరం ఆ దళంతో ఓ హెడ్‌కానిస్టేబుల్ హత్య చేయించాలని ఎస్సై కుట్ర పన్నాడు. అనుకున్నట్లుగానే దళాన్ని ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించాడు. ఈ క్రమంలో అలర్ట్ అయిన నిఘా విభాగం ఆ ఎస్సైని అదుపులోకి విచారిస్తోంది. హెడ్‌కానిస్టేబుల్‌ని హత్య చేసిన దళాన్ని ఎన్కౌంటర్ చేసి పేరు సంపాదించాలన్నది కూడా ప్రణాళికలో భాగమట. ఈ విషయాలు తెలిసి నిఘా విభాగం పోలీసులు విస్తుపోయారు. సంబంధిత హెడ్‌కానిస్టేబుల్‌ని జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు.