తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు మారాయి. కొత్త తేదీలను ప్రకటిస్తూ పోలీస్ నియామక మండలి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పరీక్షల సమయంలో వేరే ఉన్నాయని టీఎస్పీఎస్సీ చేసిన విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏప్రీల్ 23న జరిగే కానిస్టేబుల్ పరీక్షను 30వ తేదీకి , మార్చి 12వ తేదీన నిర్వహించాల్సిన ఎస్సై ఎగ్జామ్ 11వ తేదీకి మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే దేహాదారుఢ్య పరీక్షలు పూర్తవ్వగా వాటి ఫలితాలు కూడా వచ్చాయి.