సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా వడివడిగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమా టైటిల్‌ని ఉగాదికి అనౌన్స్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమా టైటిల్ కూడా ‘అ’ అనే అక్షరంతోనే మొదలు కావాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారట. అతడే పార్ధు, అర్జునుడు, అమ్మ కథ.. ఇలా పలు టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.