తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధర వరుసగా పెరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10గ్రాముల గోల్జ్ రేటు రూ.51,300కు చేరింది. 24క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.55,960 వద్ద కొనసాగుతోంది. బంగారం కొండెక్కి కూర్చోవడంతో పసిడిని కొనేందుకు ప్రజలు ఆచి తూచి ముందుకెళ్తున్నారు. అటు కేజీ వెండి ధర రూ.74,400కు చేరుకుంది.