బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరో స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇంట్లో అద్దెకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబైలోని జుహులో ఉన్న షాహిద్ లగ్జరీ అపార్ట్మెంట్లో కార్తీక్ దిగుతున్నాడు. ఈ లగ్జరీ ఇంటి అద్దె నెలకు రూ.7.5 లక్షలు. ఏడాది తర్వాత రూ.8.2 లక్షలు, ఆ తర్వాతి ఏడాది రూ.8.58 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే అడ్వాన్స్ రూపంలో రూ.45 లక్షలు కార్తీక్.. షాహిద్‌కు ముట్టచెప్పినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తైనట్లు టాక్.