ఓటీటీ బాట ప‌ట్టిన ప్ర‌ముఖ న‌టులు..ద‌ర్శ‌కులు

Screengrab Instagram: Naga Chaithanya

క‌రోనా త‌ర్వాత ఓటీటీకి ఆద‌ర‌ణ పెరిగింది. థియేట‌ర్లు మూత‌ప‌డిన స‌మ‌యంలో ఓటీటీలే ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ పంచిపెట్ట‌డంతో న‌టీన‌టుల అభిప్రాయాలు మారిపోయాయి. ప్ర‌ముఖ న‌టులు, పెద్ద ద‌ర్శ‌కులు కూడా ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య అమెజాన్ ప్రైమ్ ఓటీటీ కోసం ‘దూత’ అనే వెబ్‌సిరీస్‌లో న‌టిస్తున్నాడు. విక్ర‌మ్ కె.కుమార్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ‌త‌మానంభ‌వతి ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న క‌థ‌లు మీవి..మావి అనే సిరీస్ చేయబోతున్నాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ హిందీలో త‌స్క‌రీ అనే వెబ్‌స‌రీస్ తెర‌కెక్కిస్తున్నాడు. ‘వ‌రుడు కావ‌లెను’ ఫేమ్ ద‌ర్శ‌కురాలు ల‌క్ష్మీ సౌజ‌న్య జీ5 కోసం హీరో సుమంత్‌తో ఒక వెబ్‌సిరీస్ చేస్తుంది.

Exit mobile version